అనంతపురం జిల్లాలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్

voters
voters

రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఎన్నిక జరగకుండా ఆగిపోయిన.. 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు
సంబదించిన పోలింగ్ ఆదివారం మొదలైంది. అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి. జిల్లాలో నాలుగు పంచాయతీలు, 31 వార్డులకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 26 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలోని పుట్లూరు మండలం కంది కాపుల, లేపాక్షి మండలం కంచి సముద్రం, శేట్టూరు మండలం ఖైరేవు, రొద్దం మండలం చిన్న మత్తూరు సర్పంచ్ స్థానాలకు ఎన్నికల కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ముగియనుంది. లక్షా 32 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.

నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు మరో 12 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. వీటితో పాటు 6 నగరపాలక సంస్థలు, 4 పురపాలక సంఘాల్లోని 14 డివిజన్లు, వార్డులకు పోలింగ్‌ జరగనుంది. పది జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది