పౌరసత్వ చట్టంపై వాస్తవాలు పేరిట కరపత్రం ఆవిష్కరణ

సీఏఏ చట్టం ద్వారా ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్తులకు పౌరసత్వం కల్పించడమే

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

విజయవాడ: ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలు వాస్తవాలు పేరిట కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీకార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏ చట్టం ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించడమే తప్ప భారతీయులకు వచ్చిన నష్టమేమీ లేదని కన్నా స్పష్టం చేశారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంట్‌లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ పార్లమెంట్‌ నుంచి బయటికొచ్చాక దురుద్దేశంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విపక్షాలపై కన్నా లక్ష్మీనారయణ మండిపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మత విధ్వేశాలను రెచ్చగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/