అన్నాడీఎంకే సిఎం అభ్యర్థిగా పళనిస్వామి

ప్రకటించిన డిప్యూటీ సీఎం ప‌న్నీరుసెల్వం

అన్నాడీఎంకే సిఎం అభ్యర్థిగా పళనిస్వామి
palaniswami-to-be-aiadmk-s-cm-candidate-for-2021-assembly-polls

చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సిఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రకటించారు. దీంతో సిఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం ముగిసిపోయింది. సిఎం అభ్యర్థి ఎంపిక విషయమై ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య గత కొంతకాలంగా విబేధాలు తలెత్తాయి. దీంతో సీనియర్ మంత్రలు, పార్టీ నేతలు ఇరువురి మధ్య రాజీ ప్రయత్నాలు చేసి, సద్దుమణిగేలా చేశారు. 2021లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో 11 మంది స‌భ్యుల‌తో కూడిన స్టీరింగ్ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు అన్నాడీఎంకే పార్టీ నేత‌, సిఎం ప‌ళ‌నిస్వామి తెలిపారు. వాస్త‌వానికి డిప్యూటీ సిఎం ప‌న్నీరుసెల్వం కూడా సిఎం అభ్య‌ర్థిగా పోటీప‌డేందుకు ఆస‌క్తి చూపారు. ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో సిఎం అభ్యర్థి ఎంపికపై అధికారికంగా ప్రకటించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/