పక్క కమర్షియల్ నుండి అందాల రాశి ప్రోమో

గోపీచంద్ – రాశిఖన్నా జంటగా మారుతీ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం పక్క కమర్షియల్. జులై 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల ఫై దృష్టి సారించింది. ఈ క్రమంలో చిత్రంలోని అందాల రాశి సాంగ్ తాలూకా ప్రోమోను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. కోర్టు బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా ప్రత్యేకమైన థీమ్ తో భారీ సెట్ లో ‘అందాల రాశీ’ పాటను చిత్రీకరించారు.

ఇందులో గోపీచంద్ – రాశీ ఖన్నా జంట కలర్ ఫుల్ డ్రెస్సులో స్టైలిష్ గా మరియు అందంగా ఉన్నారు. ట్యూన్ కు తగ్గట్టుగా ఉన్న గ్రాండ్ విజువల్ ఉన్నాయి. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి కె.కె సాహిత్యం అందించారు. సాయి చరణ్ భాస్కరుని – రమ్య బెహర కలిసి ఆలపించారు. ఈ ఫుల్ సాంగ్ ను జూన్ 1 సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

YouTube video