మరోసారి ఇమ్రాన్ కు కరోనా పరీక్షలు!

పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ కు కరోనా..రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ను కలిసిన అసద్

Imran khan
Imran khan

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖురేషీ గురువారం అస్వస్థతతో బాధపడుతూ ఉండగా, కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దింతో ఇమ్రాన్ ఖాన్ కు కరోనా భయం పట్టుకుంది. ఎందుకనగా రెండు రోజుల క్రితం ఇమ్రాన్ అసద్ ఖురేషీని కలిశారు. కాగా ఇమ్రాన్ ఖాన్ కుముందు జాగ్రత్త చర్యగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల రిపోర్టు వెల్లడికావాల్సి వుంది. గతంలోనూ ఓ మారు ఇమ్రాన్ కు పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అసద్ ఖురేషీ కుటుంబీకులందరినీ అధికారులు క్వారంటైన్ చేశారు. ఇటీవలి కాలంలో అసద్ ఎవరెవరిని కలిశారు? ఆయన దగ్గరకు ఎవరెవరు వచ్చారు? అన్న విషయాన్ని గుర్తించేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:
https://www.vaartha.com/news/business/