పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె అరెస్ట్‌

Maryam Nawaz
Maryam Nawaz

లాహోర్‌ : పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం షరిఫ్‌ను పోలీసులు గురువారం నాడిక్కడ అరెస్ట్‌ చేశారు. జైలులో వున్న తన తండ్రిని పరామర్శిచేందుకు వచ్చిన ఈ 45 ఏళ్ల పిఎంఎల్‌ఎన్‌ పార్టీ ఉపాధ్యక్షురాలిని మనీ లాండరింగ్‌ కేసులో నేషనల్‌ అకౌంటబులిటీ కోర్టు అరెస్టు చేసి లాహోర్‌లోని కోట్‌లోక్‌పథ్‌ జైలుకు తరలించింది. చౌదరి సుగర్‌ మిల్స్‌ కేసులోనూ, మనీ లాండరింగ్‌, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ మర్యం షరీఫ్‌ను అరెస్ట్‌ చేసినట్లు నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/