పాక్‌ కాల్పులు..భారత పౌరుడు మ‌ృతి

కాశ్మీర్ లోని షాపూర్, కెర్ని సెక్టార్లలో దాడి

Indian Army near Jammu border
Indian Army near Jammu border

కాశ్మీర్‌: ఈరోజు ఉదయం జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు దిగింది. ఫూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్ని సెక్టార్ల పరిధిలో హఠాత్తుగా కాల్పులు మొదలుపెట్టింది. ఈ దాడిలో మన పౌరుడు ఒకరు మరణించినట్టు సైన్యం ప్రకటించింది. పాక్ కాల్పులు జరిపిన చోట సైన్యం వెంటనే అప్రమత్తమై.. దీటుగా బదులిచ్చిందని తెలిపింది. మన సైనికులెవరూ గాయపడలేదని పేర్కొంది. పూంఛ్ జిల్లాలోని కునైయన్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ కలిసి చేపట్టిన కార్డన్ సెర్చ్ లో టెర్రరిస్టుల డంప్ బయటపడింది. ఒక ఏకే 47 గన్, ఒక చైనా పిస్టల్, బుల్లెట్లు, కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పూంఛ్ ఎస్పీ ప్రకటించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/