ప్రేమ పేరుతో మహిళలను మోసం చేసిన పాక్‌ క్రికెటర్‌!

Imam ul Haq
Imam ul Haq

హైదరాబాద్‌: పాకిస్థాన్‌ ప్రముఖ బ్యాట్స్‌మన్‌ ఇమామ్‌ ఉల్‌ అనేక మంది యువతుల్ని మోసం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తన స్టార్‌డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని ఇమామ్‌ ఉల్‌ హక్‌ మోసం చేశాడని పాక్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప‌లువురు యువ‌తులతో అత‌ను ఛాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని, ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ సమయంలోనూ ఈ వ్యవహారాలను కొనసాగించాడని పేర్కొన్నాయి.అయితే ఇమామ్‌పై ఎవ‌రూ చ‌ట్ట‌ప‌రంగా కేసులు పెట్టలేదు. కాగా, తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇటు ఇమామ్‌గాని, అటు పాక్ బోర్డు కాని ఈ వివాదంపై ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు.కాగా ఆ యువతులతో ఇమామ్‌ కొనసాగించిన ఛాటింగ్‌ విశేషాలు సైతం అనేక స్క్రీన్‌షాట్లు వెలుగులోకి వచ్చాయి. కొందరు అభిమానులు వీటిని కొట్టిపారేయగా మరికొందరు యువతులకు మద్దతు తెలుపుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/