పాకిస్థాన్‌ వెళ్లొదు..అమెరికా పౌరులకు సూచన

America, Pakistan
America, Pakistan

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ పరిసర ప్రాంతాల్లో తీవ్రవారం కారణంగా పాకిస్థాన్‌ వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు సూచించింది. అయితే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) తదితర ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలనీ… ఉగ్రవాద దాడులు అధికంగా జరిగే ఈ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరిన్లకు సూచించింది. తాజాగా అమెరికా విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో పాకిస్తాన్ ప్రమాదకరమైన 3వ స్థానంలో(లెవెల్ 3) ఉండగా… పాక్‌లోని బలూచిస్తాన్, కేపీకే ప్రావిన్స్ సహా పీవోకే, భారత్పాక్ సరిహద్దు ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన ఖఖలెవెల్ 4గగ కేటగిరీలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉన్నందున తమ పౌరులు ఇక్కడికి వెళ్లవద్దని అమెరికా సూచించింది.పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో పౌర విమానయానానికి అధిక ముప్పు ఉన్నందున ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఇప్పటికే నోటీస్ టు ఎయిర్‌మెన్ (ఎన్‌వోటీఏఎం), స్పెషల్ ఫెడరల్ ఏవియేషన్ రెగ్యూలేషన్ (ఎస్ఎఫ్ఏఆర్) జారీ చేసింది..గగ అని సదరు ట్రావెల్ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రజా రవాణా సౌకర్యాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక ప్రాంతాలు, ఎయిర్‌పోర్టులు, యూనివర్సిటీలు, పర్యాటక ప్రాంతాలు, పాఠశాలలు, హాస్పత్రులు, ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యలయాలు సహా అన్ని చోట్లా పాకిస్తాన్‌లో ఉగ్రదాడుల ముప్పు ఉందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/