భారత క్రికెట్‌ టీంపై చర్యలు తీసుకోవాలి

team india wear army caps
team india wear army caps

ఇస్లామాబాద్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ క్రికెటర్లు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఆర్మీ టోపీలు ధరించారు. అయితే భారత్‌ క్రికెటర్లు ఆర్మీ టోపీలు ధరించాడాన్ని పాకిస్థాన్‌ మంత్రి పవాద్‌ చౌదరీ తప్పుపట్టారు. భారత టీం క్రికెట్‌ను రాజకీయం చేసిందంటూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌)ను పాక్‌ మంత్రి పవాద్‌ చౌదరీ కోరారు.భారత్‌ చేసిన ఈ చర్యకు నిరసనగా ఐసీసీ ముందు ఫిర్యాదు చేయాలని ఆయన పీసీబీ(పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు)కు విన్నవించారు. అయితే ఒకవేళ తదుపరి మ్యాచుల్లో కూడా భారత టీం ఆర్మీ క్యాప్‌లను ధరించటం కొనసాగిస్తే పాక్ టీం కూడా కశ్మీర్‌లో దురాగతాలకు పాల్పడుతున్న భారత్‌కు నిరసనగా నలుపు బ్యాండ్‌లు ధరిస్తారని చెప్పారు.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/