నవంబర్‌ 9న ‘కర్తార్‌పూర్’కారిడార్ ప్రారంభం

Kartarpur
kartarpur-corridor

లాహోర్ : కర్తాప్‌పూర్ కారిడార్‌ను నవంబర్ 9న ప్రారంభిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం తెలిపారు. ఈ ప్రతిపాదిత కారిడార్ పాక్‌లోని దర్బార్ సాహిబ్ ను పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ క్షేత్రానికి అనుసంధానం చేస్తుంది. భారతీయ యాత్రికులు ఇక్కడికి రావడానికి వీసా అక్కర్లేదు. 1522లో గురునానక్ దేవ్ స్థాపించిన కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించేందుకు పర్మిట్ తీసుకుంటే చాలు. భారతదేశ సరిహద్దు నుంచి కర్తార్‌పూర్‌లో గురుద్వారా దర్బార్ సాహిబ్ వరకు పాకిస్థాన్ ఈ కారిడార్‌ను నిర్మిస్తోంది.

ఈ కారిడార్‌లోని రెండో భాగాన్ని భారతదేశం నిర్మిస్తుంది. అది కూడా సరిహద్దు నుంచి డేరా బాబా నానక్ వరకూ నిర్మితమవుతుంది. ఖకర్తార్‌పూర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ప్రపంచం నలుమూలల నుంచీ సిక్కులు ఈ పవిత్రస్థలానికి వచ్చేందుకు పాకిస్థాన్ ద్వారాలు తెరిచింది. 2019 నవంబర్ 9న యాత్రికులకు ఈ కారిడార్‌ను ఆవిష్కరిస్తారుగ అని ఇమ్రాన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో స్పష్టం చేశారు. దాంతో ఇంతవరకూ ఉన్న సందేహాలకు తెరపడింది. నవంబర్ 12న సిక్కు మత ప్రవక్త గురునానక్ దేవ్ 550వ జయంతికి ఈ కారిడార్ ప్రారంభమవుతుందా? అనే సందేహాలు కూడా వచ్చాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/