నేడు పాక్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌!

pakistan team
pakistan team

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ జట్టు తలపడనున్నాయి. న్యూజిలాండ్‌ జట్టు సెమీఫైనల్స్‌ బెర్తుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌ ఓడినా..న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మరోవైపు పాక్‌ పరిస్థితి అలా లేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో రెండు గెలిచిన పాక్‌ మూడు ఓడింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్డయింది. దీంతో పాక్‌ 5 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్‌ గెలవాల్సిందే.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/