తాలిబన్‌ సైపుల్లా మెహసూద్‌ హతం

Qari Saifullah Mehsud
Qari Saifullah Mehsud

ఇస్లామబాద్‌: తాలిబన్‌ కమాండర్‌ క్వారీ సైపుల్లా మెహసూద్‌ అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సాయుధ బలగాల దాడిలో హతమయ్యాడు. ఖోస్త్‌ ప్రావిన్‌ంసలోని గులూన స్థావరం సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక వేర్పాటువాద గ్రూపు హక్కానీ నెట్‌వర్క్‌ ఈ దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో తెహ్రిక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కి చెందిన సైపుల్లాతో సహా ముగ్గురు సభ్యులు కూడా మృతిచెందినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా 2015లో 45 మందిని బలితీసుకున్న కరాచీ బస్‌ దాడిలో మెహసూద్‌ నిందితుడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/