నా దుస్తులు అమ్మైనా తక్కువ ధరలో గోధుమ పిండిని అందిస్తా: పాక్ ప్రధాని

pakistan-prime-minister-says-he-will-sell-my-clothes-to-provide-cheapest-wheat-flour-to-people

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వినూత్నమైన శపధం చేశారు. 24 గంటల్లో పది కిలోల గోధుమ పిండి బ్యాగ్‌ని రూ.400లకు తగ్గించకపోతే తన దుస్తులను అమ్మేస్తానని అన్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా సీఎం మహమూద్ ఖాన్‌కి చెప్పారు. థకరా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా “నేను నా మాటలను మళ్లీ చెబుతున్నాను. నేను నా దుస్తులను విక్రయిస్తాను. ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండిని అందిస్తాను.” అని అన్నారు.

ఇదే సందర్భంలో షెహబాజ్ షరీఫ్ గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్ ఖాన్ దేశానికి అత్యధిక ద్రవోల్బణం, నిరుద్యోగాన్ని బహుమతిగా ఇచ్చాని ఎద్దేవా చేశారు. ఖాన్ ఐదు మిలియన్ ఇళ్లు, పది మిలియన్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాడని కానీ విఫలమయ్యాడని ఆరోపించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాడని విమర్శించారు. అలాగే ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో పెడతానని, దాని కోసం తన ప్రాణాలను కూడా వదులుకుంటానని షెహ‌బాజ్ అన్నారు.

ప్రజలు తనపై విశ్వాసం ఉంచారని, తనకు అనుకూలంగా ఓటు వేయడానికి వచ్చారంటూ బలూచిస్థాన్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. ” బలూచిస్తాన్ ప్రజలు పోలింగ్ సెంటర్లకు తరలివచ్చారు. నేను ఊహించినట్లుగా ఓటర్లు 30 నుంచి 35 శాతం మధ్య ఉంటారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం, శాంతిభద్రతలను మెరుగుపరుస్తుంది.” అని షెహబాజ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారన్నారు. ప్రజలు గద్దె దించుతారని గ్రమించే ఇంధన ధరలు తగ్గించారని విమర్శించారు. అలాగే ఇదే వేదికపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన తండ్రి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రశంసించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/