ప్రోటోకాల్‌ను మరచిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌

imran khan, saudi king
imran khan, saudi king

సౌదీ: సౌదీ అరేబియా ప్రభుత్వం గతవారం ఓఐసి సమ్మిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సమ్మిట్‌కు పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ కూడా హాజరయ్యారు. ఐతే తాజాగా ఇమ్రాన్‌ఖాన్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియోను గమనిస్తే సమ్మిట్‌లో పాల్గొన్న ఇమ్రాన్‌ సౌది రాజు సల్మాన్‌ బిన్‌ వద్ద ప్రవర్తించిన తీరుపై పాక్‌ ముస్లిం లీగ్‌ సభ్యులు మండిపడుతున్నారు. ఐతే ఆ సమ్మిట్‌లో ఇమ్రాన్‌ సౌదీరాజు దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి ఆయనను పలకరించి ఏదో మాట్లాడారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌లేటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పింది రాజుకు వివరిస్తూ ఉండగా ఇమ్రాన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కనీసం తాను ఏం చెప్పింది సౌదిరాజు వినే వరకు కూడా ఉండకుండా ప్రోటోకాల్‌ను సైతం మరచి ఇమ్రాన్‌ ప్రవర్తించిన తీరు పలువురికి ఆగ్రహం తెప్పించింది. ఇమ్రాన్‌ చేసిన పనికి పలు మీటింగ్‌లు రద్దయ్యాయని, సౌది, పాక్‌ల మధ్య జరగాల్సిన సమావేశం కూడా ఈ మేరకు రద్దయినట్లు సమాచారం. నెటిజన్లు కూడా ఆయన తీరుపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/news/international-news/