నేడు తేలనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ భవితవ్యం

అవిశ్వాసంపై నేడు ఓటింగ్‌

ఇస్లామాబాద్: నేడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ రాజకీయ భవితవ్యం తేలిపోనుంది. ఇమ్రాన్ పైన అవిశ్వాసం పై ఈ రోజు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఇమ్రాన్ మైనార్టీలో పడ్డారు. దీంతో..ఓటింగ్ జరిగితే ఫలితం ఏంటనేది ఇమ్రాన్ కు స్పష్టత ఉంది. దీంతో..ఇమ్రాన్ ఈ రోజు జరిగే ఓటింగ్ ఎదుర్కొంటారా..లేక, ముందుగానే రాజీనామా చేసి ముందస్తు నిర్ణయం వైపు వెళ్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో ఆదివారం ఓటింగ్‌ జరుగనుంది. ఇప్పటి వరకు అవిశ్వాసం నుంచి గట్టేక్కేందుకు ఇమ్రాన్ తన ముందున్న అన్ని ఆప్షన్లను పరిశీలించారు.

కాగా, తాను రాజీపడనని..చివరి నిమిషం వరకు పోరాడుతానని ఇమ్రాన్ స్పష్టం చేసారు. కొందరు తమను వీడి ప్రత్యర్ధులతో చేతులు కలిపి ద్రోహం చేసారంటూ మండిపడ్డారు. విదేశీ కుట్రకు స్వదేశీ నేతలు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన లాయర్లతో మాట్లాడానని, ద్రోహులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇమ్రాన్ తన పదవిలో కొనాగాలాంటే ఆయనకు విశ్వస పరీక్షలో అనుకూలంగా 172 మంది ఓటింగ్ చేయాల్సి ఉంటుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/