పాకిస్థాన్‌లో తెరుచుకున్న విద్యాసంస్థలు

Pakistan opens all educational institutions

ఇస్లామాబాద్‌: దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత పాకిస్థాన్‌లో విద్యాసంస్థ‌ల‌న్నీ నేడు తెరుచుకున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండూ బుధ‌వారం తెరుచుకున్నాయి. కాగా కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌ప్పనిస‌రిగా పాటించాల్సిందిగా విద్యాసంస్థ‌ల‌కు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఫెడరల్ ఎడ్యుకేషన్ మినిస్ట‌ర్‌ షఫ్కత్ మహమూద్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో గరిష్ట సంఖ్యలో విద్యార్థులు చేరారన్నారు. విద్యాసంస్థలు మూసివేయడం వల్ల వారు ఎక్కువగా నష్టపోయారని చెప్పారు. కరోనావైరస్ పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించిన అనంత‌రం మాత్ర‌మే అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

కాగా పాకిస్థాన్‌‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3,12,263 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 6,479 మంది కరోనాతో చనిపోయారు. 467 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. 2,96,881 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/