14 ఏండ్ల బాలికతో పాక్ ఎంపీ వివాహం

అక్టోబర్ 2006లో జన్మించిన బాలిక..విచారిస్తున్న పోలీసులు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఎంపీ మౌలానా సలాఉద్దీన్‌ అయూబి 14 ఏండ్ల బలూచిస్తాన్‌ బాలికను పెండ్లి చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెలూచిస్థాన్ జాతీయ అసెంబ్లీ మెంబర్, జమియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత మౌలానా సలాహుద్దీన్ అయూబీ, ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లాడిన అమ్మాయి వయసు 14 ఏళ్లు మాత్రమేనని, అక్టోబర్ 2006లో జన్మించిన బాలిక, ఇప్పుడు జుగూర్ ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతోందని స్థానిక మహిళా సంక్షేమ విభాగం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి పాకిస్థాన్ లో బాలికలకు 16 ఏళ్లు వచ్చే వరకూ వివాహం చేయరాదు. అంతకన్నా తక్కువ వయసులో పెళ్లి చేస్తే, తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడతాయి. సలాహుద్దీన్ వివాహంపై విచారణ ప్రారంభించిన పోలీసులు, బాలిక తల్లిదండ్రులను విచారించారు. వారు అసలు తమ అమ్మాయికి వివాహమే జరిపించలేదని అఫిడవిట్ ను ఇచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక సలాహుద్దీన్ వివాహం చేసుకుంది బాలికనేననే వార్తలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/