షరీఫ్‌ను అప్పగించండి..బ్రిటన్‌ను కోరిన పాక్‌

షరీఫ్ బెయిల్ ఎప్పుడో ముగిసిందన్న పాక్

Nawaz-Sharif
Nawaz-Sharif

లాహోర్‌: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వెంటనే అప్పగించాలని బ్రిటన్ కు పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. నవాజ్ షరీఫ్ ను పారిపోయిన వ్యక్తిగా ఇమ్రాన్ ఖాన్ సలహాదారు షాజాద్ అక్బర్ అభివర్ణించారు. నాలుగు వారాల బెయిల్ ఆమోదించినప్పటికీ షరీఫ్ ఇంకా బ్రిటన్ నుంచి తిరిగి రాలేదని, అందువల్ల షరీఫ్‌ను బ్రిటన్ నుంచి రప్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం డిమాండ్ చేసింది.

కాగా, అత్యవసర చికిత్స కోసం అంటూ లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అనేక సందర్భాల్లో లండన్ లో బహిరంగంగా దర్శనమిచ్చారు. ఆయనలో అనారోగ్య ఛాయలేవీ లేకపోగా, ఎంతో ఉల్లాసంగా కనిపించారు. దీనిపైనా అక్బర్ ఘాటుగా స్పందించారు. న్యాయవ్యవస్థకు ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. తీవ్ర అనారోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ అపహాస్యం అయిందన్న కోణంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/