ఐపిఎల్‌ ప్రసారాలను నిషేధించిన పాక్‌…

IPL 2019
IPL 2019

ఇస్లామాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -2019 ప్రసారాలను పాకిస్తాన్‌లో నిషేధిస్తున్నారని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ తెలిపారు. ఈమేరకు …రాజకీయాలను, క్రీడలను వేరుగా చూడాలని భావించాం. కానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పిఎస్‌ఎల్‌) జరిగిన సమయంలో భారత ప్రభుత్వం, కంపెనీలు పాక్‌ క్రికెట్‌ జట్ల ప్రవర్తించిన తీరు మాకు గుర్తుంది. కాబట్టి ఐపిఎల్‌ ప్రసారాలు పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం. అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇక పాక్‌ ప్రధాని, ఆదేశ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోటోలను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) తొలగించిన సంగతి తెలిసిందే అంతేకాదు రానున్న ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పుల్వామా ఘటనకు సంతాప సూచకంగా మిలటరీ క్యాపులు ధరించినందుకు టీమిండియా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐసిసికి ఫిర్యాదు చేసింది కూడా. కాగా మరో రెండు రోజుల్లో ఇండియన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపిఎల్‌ 2019 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 23న జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లీ మిస్టర్‌ కూల్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సిఎస్‌కె) జట్టు….టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు (ఆర్‌సిబి) జట్టుతో తలపడనుంది. ఇద్దరు దిగ్గజాల జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయరడి :