రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పాక్‌ క్రికెటర్‌ షార్జీల్‌ ఖాన్‌…

SHARJIL
SHARJIL

కరాచీ: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పిఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్‌ షార్జీల్‌ఖాన్‌ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షార్జిల్‌కు ఆదేశ యాంటీ కరప్షన్‌ యూనిట్‌ (అవినీతి నిరోధక శాఖ) నుంచి క్లియరెన్స్‌ లభించడంతో అతను ఆడటానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు ఇటీవల పిసిబి యాంటీ కరప్షన్‌ యూనిట్‌ ముందు హాజరైన షార్జిల్‌ ఖాన్‌కు దేశశాళీ ఈవెంట్లలో ఆడటానికి అనుమతి లభించింది. దాంతో త్వరలో ఆరంభం కానున్న పిఎస్‌ఎల్‌లో షార్జిల్‌ ఆడనున్నాడు. పిఎస్‌ఎల్‌ ఆడటగాళ్ల డ్రాఫ్ట్‌లో షార్జిల్‌ చేరబోతున్నాడు. పాకిస్తాన్‌ తరపున 25వన్డేలు, ఏకైక టెస్టు, 15 అంతర్జాతీయ టీ20లు ఆడిన షార్జిల్‌…పిఎస్‌ఎల్‌ రెండో ఎడిషన్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దాంతో 2017 ఆగస్టులో అతనిపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ పిసిబి నిర్ణయం తీసుకుంది. ఆగా, తనను క్షమించాలంటూ పిసిబికి షార్జిల్‌ విన్నవించుకోవడంతో అతనిపై ఉన్న నిషేదాన్ని రెండేళ్లకే పరిమితం చేశారు. దాంతో షార్జిల్‌పై నిషేధం ముగిసింది. దాంతో షార్జిల్‌ తన కెరీర్‌ను తిరిగి కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కాగా, ఖలీద్‌ లతీఫ్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, మహ్మద్‌ నవాజ్‌, నసీర్‌ జెంషెడ్‌, షహ్‌జైబ్‌ హసన్‌లు ఇంకా నిషేధం ఎదుర్కొంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/