పౌరసత్వ సవరణ బిల్లునూ వదలని పాకిస్తాన్

Pakistan
Pakistan

ఇస్లామాబాద్: మనదేశం తీసుకున్న ప్రతి చర్యపైనా విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది పాకిస్తాన్. ఇదివరకు జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఏకంగా అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ తన అక్కసును వెల్లగక్కింది. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లుపైనా అదే వైఖరిని కనపరుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించడంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. ముస్లింల పట్ల విచక్షణధోరణికి భారత ప్రభుత్వం తెర తీసిందని ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ పేరు మీద ఓ ప్రకటన విడుదలైంది. పౌరసత్వ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ చర్యను ఐక్యరాజ్య సమితి వద్ద ప్రస్తావిస్తామని పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/