నేటి నుంచి పాక్-బంగ్లా టెస్టు

Pakistan vs. Bangladesh
Pakistan vs. Bangladesh

రావల్పిండి: సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో చారిత్రక టెస్టు సమరానికి పాకిస్థాన్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రావల్పిండి వేదికగా టెస్టు మ్యాచ్ జరుగనుంది. శుక్రవారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఇటీవలే శ్రీలంకతో స్వదేశంలో పాకిస్థాన్ రెండు టెస్టుల్లో తలపడిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌తో కూడా సొంత గడ్డపై ఓ టెస్టు మ్యాచ్ పాకిస్థాన్ ఆడనుంది. ఈ మ్యాచ్ జరుగడంపై పలు సందేహాలు నెలకొన్నా చివరికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును పాకిస్థాన్‌కు పంపించేందుకు అంగీకరించింది. దీంతో టెస్టు మ్యాచ్ నిర్వహణపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఇక, ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఇటు పాకిస్థాన్ అటు బంగ్లాదేశ్‌లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/