పాకిస్థాన్‌ అదుపులో 34మంది భారత జాలర్లు

Indian fishermens
Indian fishermens

కరాచీ: 34 మంది భారత జాలర్లను పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకుంది. పాక్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించారంటూ వీరిని మంగళవారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరితో పాటు ఆరు బోట్లను కూడా పాక్‌ స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్థాన్‌ తీరప్రాంత గస్తీ దళం ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అయితే జాలర్లను స్థానిక పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ఖఖవాళ్లను జుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతాం. జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలా లేదా అన్నది మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు…గగ అని సదరు అధికారి పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి తర్వాత పాకిస్తాన్ దళాలు భారత జాలర్లను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. జనవరిలో గుజరాత్‌కి చెందిన ఐదుగురు జాలర్లను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ వారిని జైళ్లలో నిర్బంధించింది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/