ఓ అబద్దాన్ని పదేపదే చెబితే అది నిజం కాదు

F-16 jet fighter
F-16 jet fighter

ఇస్లామాబాద్‌: ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానంపై భారత్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి భారత్‌ పలు ఆధారాలను కూడా చూపించింది. కాగా ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చినట్టు రాడార్‌ చిత్రాలను కూడా భారత్‌ చూపించింది. కానీ ఈ ఆధారాలపై పాక్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ నిశ్శబ్దాన్ని తక్కువగా అంచనావేయొద్దని తాజాగా వ్యాఖ్యానించింది. అయితే భారత వైమానిక దళ ప్రకటనపై పాకిస్థాన్‌ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ స్పందించారు. ఖఎఫ్‌16పై ఐఏఎఫ్‌ ఇప్పటికీ ఆధారాలు చూపించలేదు. ఓ అబద్ధాన్ని పదేపదే చెబితే అది నిజం కాదు. ఎఫ్‌16 యుద్ధ విమానాన్ని కూల్చామని చెబుతున్నారే తప్ప.. అందుకు తగ్గ ఆధారాలను ఇప్పటికీ ప్రదర్శించడం లేదు. మా నిశ్శబ్దాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. నిజం ఏంటంటే భారత్‌కు చెందిన రెండు ఐఏఎఫ్‌ జెట్లను పాక్‌ కూల్చింది. ఇందుకు సంబంధించిన శకలాలను కూడా అందరికీ చూపించాం అని గఫూర్‌ ట్వీట్‌లో తెలిపారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/