పాక్‌ స్పందనపై అసహనం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ

Raveesh Kumar
Raveesh Kumar

న్యూఢిల్లీ: పుల్వామా దాడికి సంబంధించి భారత్‌ పాకిస్థాన్‌కు అందించిన ఆధారలపై పాక్‌ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది. అయితే పాక్‌కి స్పష్టమైన ఆధారాలు సమర్పించినప్పటికి వారు పాత పాటే పాడుతున్నారు. నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై పాక్‌ ముందు నుంచి దుర్నీతిని ప్రదర్శిస్తోందన్నారు. కాగా ఈసందర్భంగా వారి సమాధానం పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదన్నారు. పుల్వామా దాడి వెనక జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ హస్తం ఉందంటూ భారత్.. పాక్‌కు స్పష్టమైన ఆధారాలను సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్‌.. భారత్‌ చెప్పిన చోట అసలు ఎలాంటి శిబిరాలు లేవని చెప్పుకొచ్చింది. అలాగే ఈ దాడులతో ఉగ్ర ముఠా నాయకుడు మసూద్‌ అజార్‌కు సంబంధం ఉన్నట్లు సరైన ఆధారాలు లేవని వాదించింది. ఎలాంటి ఉగ్రముఠాలకు ఆశ్రయం కల్పించేది లేదని పాక్‌ నాయకులు చెబుతున్నారు. అలాగే 2004లోనూ ఇలాంటి హామీలే ఇచ్చారు. పాకిస్థాన్‌ వాటికి కట్టుబడి ఉండాలి. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ ఇప్పటికైనా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి అని తాజాగా భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/