పివోకెను వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలి: రూపానీ…

vijay rupani
vijay rupani


వడోదర: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజ§్‌ు రూపానీ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. అంతేగాక, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఓకె)ను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. భారత్‌ ఏక్తా మంచ్‌ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పిఓకె) కూడా మనదే. పిఓకెనే వదులకునేందుకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉండాలి. సమైక్య భారతావని కోసం తాము పిఓకెను కూడా సాధించి తీరుతాం. పాకిస్తాన్‌ ఉగ్రవాదులను మద్ధతు పలకడం మానుకోవాలి. దీన్ని భారత్‌ ఏ మాత్రం సహించదని విజ§్‌ు రూపానీ తేల్చి చెప్పారు. పాక్‌ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గుర్తు చేశారు. 1971లో ఢిల్లీని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నించిందని…అయితే, అప్పుడు కరాచీని పోగొట్టుకునే పరిస్థితి ఆ దేశానికి వచ్చిందని ఎద్దేవా చేశారు. పాక్‌ సైన్యం తమకు లొంగిపోయిందని గుజరాత్‌ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కాగా, ఆగస్టు పార్లమెంట్‌ సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం జరిగింది.
తాజా జాతీయ వార్తలకు క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/