భారత జనాభాపై నోరు జారిన పాకిస్థాన్ ప్రధాని
Imran-Khan
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను భారత్ జనాభాపై నోరు జారి, అప్రతిష్ఠపాలై నెటిజన్లతో తిట్టించుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఇండియా జనాభా 1 బిలియన్ 300 కోట్లు అని ఇమ్రాన్ అన్నారు. ఆ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇండియాను న్యూజిలాండ్ ఓడించిన సంగతి తెలుసు కదా. ఇదే విషయాన్ని చెబుతూ.. 40-50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 1 బిలియన్ 300 కోట్ల జనాభా ఉన్న ఇండియాను ఓడించింది అని అన్నారు. లైవ్ వీడియోలో ఆయన ఇలా పొరపాటు చేయడంతో ఇంటర్నెట్‌లో ఇమ్రాన్‌ను ఆడుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో ఉజ్బెకిస్తాన్ గురించి మాట్లాడుతూ.. ఆ దేశ ప్రజల కంటే కూడా దాని చరిత్ర తనకే ఎక్కువ తెలుసని ఇమ్రాన్ అన్న సందర్భంలోనూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/