భారత్‌కు పాకిస్థాన్ ప్రజల క్షమాపణ!

న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన చంద్రయాన్ మిషన్ ల్యాండింగ్ చివరి నిమిషంలో సిగ్నల్స్‌కు అందకుండా పోవటంతో నిరాశ చెందారు. అయితే పోయింది సిగ్నల్స్ మాత్రమేనని నమ్మకం కాదని భారతీయులంతా ఇస్రో శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలిచారు. అంతేగాక ప్రపంచదేశాలన్నీ ఇస్రో ప్రయోగానికి అభినందించాయి. కాని పాకిస్థాన్ మంత్రి చేతకాకపోతే ఊరుకోవాలిగాని, ఇలా చేయడమెందుకు? భారత్‌లాంటి పేద దేశం రూ.1000 కోట్ల రూపాయలను చంద్రయాన్ పేరుతో తగలేసిందని పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో భారత్ నెటిజన్లు ఆయనపై ఒక్కసారిగా మండిపడ్డారు. అయితే పాకిస్థాన్‌లో చాలా మంది భారతదేశం చేసిన చంద్రయాన్-2 ప్రయోగంపై తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక కొందరు పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు కూడా చెపుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు అసహనంగా ఉన్నామని, ఇండియా చేసిన ప్రయోగం చాలా గొప్పదని, ఇండియాకు ఆల్ ది బెస్ట్ అంటూ పాకిస్థానీయులు ప్రశంసించారు. ఈ ప్రయోగం మీద తమ మంత్రి అన్న మాటలు తప్పని ఇది భారత్ సాంకేతికంగా సాధించిన విజయమని ఆ దేశస్తులు పేర్కొన్నారు.
ఈ విషయంలో పాకిస్తాన్ దశాబ్దాలుగా వెనుకబడి ఉందని, ఇండియాను ఎద్దే చేసే బదులు అంతరిక్ష పరిశోధనలు చేయాల్సి అవసరముందని, ఇప్పటికైనా పాకిస్తాన్ మేల్కొనాలని వారు హితవు పలికారు. పాకిస్థాన్ శాస్త్రసాంకేతిక రంగాలలో, పరిశోధనల్లో దృష్టి పెట్టకుండా భారత్‌ను విమర్శించే పని పెట్టుకుందని అభిప్రాయపడ్డారు. అలీ మొయిన్ నవాజ్ అనే రచయిత సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్లో ‘చంద్రుడు భూమి నుండి మూడు లక్షల 84 వేల 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక భారతదేశం తాను చేసిన ప్రయోగంలో చివరి రెండు కిలోమీటర్ల దూరంలో ఫెయిల్ అయింది. 10 బిలియన్లలో వారు చంద్రుని దగ్గరగా ఉన్న రోవన్‌ను సాధించారన్నారు. ఇది ఆయుధాల యుద్ధం కాదు, భారత్ సాధించిన అభివృద్ధి అని ఆయన తాను చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. ఎవరూ చేయని సాహసం భారత్ చేసింది. వారు చేసిన ప్రయోగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ట్వీట్‌కు నెటిజన్లు స్పందించారు. భారత్ మార్స్ మీదకు ఉపగ్రహాలను పంపుతున్నది. దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెడుతున్నది. వారు చేస్తున్న ప్రయోగాలను మెచ్చుకోవాలి లేదా ఊరుకోవాలి అంటూ మంత్రి ఫవాద్‌ను చివాట్లు పెడుతున్నారు. చంద్రునిపై దిగేందుకు భారత్ సాహసం చేసింది, వీలయితే భుజం తట్టాలి వారి నుంచి స్ఫూర్తి పొందాలి అంటూ సొంత దేశం నుంచే విమర్శలు వస్తుండడంతో పాక్ ప్రభుత్వం అయోమయంలో పడింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/international-news/