పుల్వామా దాడిపై మాట మార్చిన పాక్‌ మంత్రి

భారత్ మీడియా తన మాటలను వక్రీకరించిందని వ్యాఖ్య

పుల్వామా దాడిపై మాట మార్చిన పాక్‌ మంత్రి
pak-minister-makes-uturn-after-admitting-countrys-role-in-jk-attack

ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడి పూర్తిగా తమ పనేనని పాక్‌ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫవాద్ చౌధురి అంగీకరించారు. అయితే ఇప్పుడు పాక్‌ మళ్లీ మాట మార్చింది. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని..తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మంత్రి ఫవాద్ చౌధురి తాజాగా చెప్పడం గమనార్హం. పుల్వామా దాడి తర్వాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించే తాను మాట్లాడానని ఫవాద్ చెప్పారు. అమాయకులను చంపి తాము ధైర్యవంతులుగా చెప్పుకోదల్చుకోలేదని అన్నారు. ఉగ్రవాదానికి తాము ముందు నుంచి వ్యతిరేకమే అని చెప్పారు. తన మాటలను భారత మీడియా వక్రీకరించిందని అన్నారు. పుల్వామా దాడి చేయించింది పాకిస్థానే అని తాను అనలేదని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

కాగా గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వా§్‌ుపై ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/