మసూద్‌ ఆస్తుల జప్తుకు పాక్‌ ఆదేశాలు

Masood Azhar
Masood Azhar

ఇస్లామాబాద్‌: ఐరాస జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ అధిపతి మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం మసూద్‌పై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం అతడి ఆస్తులను జప్తు చేయాలంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాక ఎలాంటి ఆయుధాల కొనుగోలు, విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం ఓ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆంక్షల కమిటీ నిబంధనలకు అనుగుణంగా మసూద్‌పై తగు చర్యలు తీసుకుంటున్నామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే మసూద్‌ విదేశీ ప్రయాణాలపైనా పాక్‌ నిషేధం విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ మండలి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నామని ప్రకటించిన పాక్‌.. అతడిపై వెంటనే ఆంక్షలను అమలుచేస్తామని బుధవారం ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/