పుల్వామా దాడివెనుక పాక్‌ ఐఎస్‌ఐ హస్తం

masood azar
masood azar, global terrorist

అమెరికా సిఐఎ నిపుణుల విశ్లేషణ
వాషింగ్టన్‌: భారత్‌లోని జమ్ముకాశ్మీర్‌ పుల్వామా జిల్లాలోజరిగిన ఉగ్రదాడి ఘటన వెనుక ఐఎస్‌ఐ హస్తం ఉందని అమెరికా భద్రతా నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.జైషేముహ్మద్‌ ఈ దాడులు తామే నిర్వహించినట్లు చెపుతున్ననేపథ్యంలో ఐసిస్‌ పాత్ర ఎంతవరకూ ఉన్నదన్న అంశంపై అమెరికా వేగులు విశ్లేషణచేస్తున్నారు. సిఐఎ మాజీ విశ్లేషకులు బ్రూస్‌ రీడెల్‌మాట్లాడుతూ ఖచ్చితంగా ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. పాకిస్తానీ ఐఎస్‌ఐ వేగుల హస్తం ఖచ్చితంగా ఉందని అమెరికానిపుణులు పేర్కొంటున్నారు. పుల్వామా జిల్లాలో జరిగిన దాడిలో 37 మంది సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అమెరికా పాకిస్తాన్‌ను జైషేముహమ్మద్‌పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడిచేయడంలో విఫలం అయినందువల్లనే పుల్వామాలో దాడిజరిగిందన్న వాదన కూడా వచ్చింది. ఇలాంటి ఉగ్రసంస్థలకు పాకిస్తాన్‌ ఇంటర్‌సర్వీస్‌ ఇంటిలిజెన్స్‌(ఐఎస్‌ఐ) ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తోందని బ్రూప్‌ రీడెల్‌ వెల్లడించారు. ఈదాడి వెనుకసూత్రదారుల అడుగులు పాకిస్తాన్‌లోనే ఉన్నాయని, ఇలాంటి సంస్థలే పాకిస్తాన్‌రపధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సవాళ్లు విసురుతున్నట్లు రీడెల్‌ వెల్లడించారు. పుల్వామా దాడి అనేది ఇపుడు పాకిస్తాన్‌ప్రధానికి కొత్త సవాల్‌ అని జైషే పునాదులు పాక్‌లోనే ఉన్నందున ఆయన యంత్రాంగానికి సంక్లిష్ట సమస్య అవుతుందనిఅన్నారు. ఒబామా యంత్రాంగంలో మాజీ భద్రతా మండలిసభ్యుడు అనీష్‌గోయల్‌మాట్లాడుతూ పాకిస్తాన్‌ కేంద్రంగా ఉన్న ఉగ్రగ్రూపులు కాశ్మీర్‌లో ఇప్పటికీ పనిచేస్తున్నాయన్న వాదనను పుల్వామా దాడి నిజంచేసిందని అన్నారు. ఈ ఉగ్రసంస్థలు కావాలనే ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాలనిచూస్తున్నాయని పేర్కొన్నారు. ఈదాడులకారణంగా భారత్‌ప్రధాని నరేంద్రమోడీపై ప్రతీకారచర్యలు కఠినంగా ఉండాలన్న ఒత్తిడికూడా పెరుగుతుందని, అన్ని మిలిటెంట్‌గ్రూప్‌లపైనా కాశ్మీర్‌పరంగాచర్యలు తీసుకోవాలని అన్నారు. బిజెపి విదేశీ మిత్రులసంఘం అమెరికాలోప్రకటనచేస్తూ చైనా మసూద్‌ అజర్‌ను వెనకేసుకురావడంపట్ల సిగ్గుపడాలని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ నిజాయితీని ప్రదర్శిస్తేముందు అజర్‌ను అరెస్టుచేసి అన్ని ఉగ్రసంస్థలను నిషేధించాలనికోరారు. భారత్‌పాకిస్తాన్‌ సంబంధాలు మరింత దెబ్బతింటున్నాయని, ఈ పరిస్థితి మరింత ఉధృతం అయితే మరింత దెబ్బతింటాయని అన్నారు. భారత్‌లో రానున్న ఎన్నికల దృష్ట్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుందని, రెండువైపులా మరిన్ని సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని యూసుఫ్‌ పేర్కొన్నారు.