అమర్‌నాథ్‌ యాత్రపై పాక్‌ ఉగ్రవాదలు గురి

Indian Army-KJS Dillon
Indian Army-KJS Dillon

న్యూఢిల్లీ: ప్రముఖ అమర్ నాథ్ యాత్రపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గురి పెట్టారు. అమర్ నాథ్ యాత్రను పాక్ సైన్యం ఛిన్నాభిన్నం చేయాలనుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిందని భారత ఆర్మీ తెలిపింది. చీనార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ మాట్లాడుతూ, పాక్ సైన్యం అండతో అమర్ నాథ్ యాత్రలో హింసకు పాల్పడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని మూడు, నాలుగు రోజులుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయని తెలిపారు. యాత్ర మార్గంలో మందుపాతరలు, పేలుడు పదార్థాలు, స్నిపర్ రైఫిల్ గుర్తించామని… ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహకారం అందిస్తోందనే విషయం మరోసారి బయటపడిందని ధిల్లాన్ చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/