హద్దు మీరుతున్న పాక్‌ కవ్వింపు చర్యలు

హద్దు మీరుతున్న పాక్‌ కవ్వింపు చర్యలు
poonch sector


పూంఛ్‌: జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్‌ఓసి వద్ద పాక్‌ రేంజర్లు ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రాజౌరి జిల్లాలో నిన్న కాల్పులకు తెగబడిన పాక్‌ మూకలు..మరుసటి రోజే మళ్లీ కాలుదువ్వడం గమనార్హం. ఎల్‌ఓసి పొడవునా పాక్‌ సైన్యం అకారణంగా కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దంటూ పలుమార్లు భారత్‌ హెచ్చరించినా పాక్‌ బేఖాతరు చేస్తూ వస్తుందని ఓ సైనికాధికారి పేర్కొన్నారు.