కడుపులో పురుగుల నివారణ

Pain
Pain

కడుపులో పురుగుల నివారణ

ఈ పురుగులు ఒక సెంటీమీటరు పొడవులో ఎర్రగా ఉంటాయి. ఇవి విరేచనంలో కనబడవు. ఇవి మలంతో పాటుగా లార్వా దశలో బయటకు వస్తాయి. బయట మట్టిలో కలిసిపోయి బాగా వృద్ది చెంది మరొకరి శరీరం లోకి ప్రవేశించటానికి ఎదురు చూస్తుంటాయి.

పాదరక్షలు లేకుండా మట్టిలో తిరిగే వ్యక్తుల పాదాల మీదకు చేరి అక్కడి చర్మాన్ని కొద్దిగా తొలగించి శరీ రంలోకి ప్రవేశిస్తాయి. ఇవి శరీరమంతా దురదను పుట్టిస్తాయి.ఆ తర్వాత ప్రేగులలో నిలవ ఉంటాయి. రీ ఈ పురుగులు కొక్కేల మాదిరిగా ఉంటాయి.

ఇవి రక్తాన్ని పీల్చడం వలన రక్తహీనత కలుగుతుంది. గుండె దడ, నరాల బలహీనత, ఆయాసం కలుగుతాయి.ఇవి శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే బయట మట్టిలో తిరగకూడదు. ఆరుబయట మల విసర్జన చేయకూడదు.

కడుపు నొప్పితో పాటుగా విరేచనాలుకూడా అవు తున్నప్పుడు మలపరీక్ష చేయించి, దానికి తగిన మందుల ను వాడితే ఈ కొంకి పురుగుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

కొరడా పురుగులు :
ఇవి కొరడా ఆకారంలో ఉండి సుమారు మూడునుంచి అయిదు సెంటీమీటర్ల పొడవుగా లేతఎరుపురంగులో గాని బూడిదరంగులోగాని ఉంటాయి. ఇవి కూడా కలుషిత నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ఇవి పెద్ద ప్రేగులలో నివాసం ఉంటాయి. వీటి ద్వారా విరేచనాలు, రక్తహీనత, కడుపునోప్పి,వాంతులు లాంటి లక్షణాలు కలిగిస్తాయి. కొందరు పిల్లలకు మలాశయం లేదా పేగు భాగం మలద్వారం నుండి కిందకు జారవచ్చు. అయితే ఆకొరడాపురుగులు ఇతర పురుగులంత ప్రమాదకరమైనవి కాదు.

జియార్డియాసిన్‌:
ఇవి ప్రధానంగా చిన్న ప్రేగులలో ఉంటాయి. ఈ క్రిమి వల్ల జియార్డియా రాంబలియా అనే వ్యాధి కలుగుతుంది. కడుపుపై భాగాన నులినొప్పిని కలిగిస్తాయి. కడుపులో వాయువులు, ఆకలి లేకపోవడం, నీళ్ళ విరేచనాలు, వికారంగా అనిపించడం ఈ వ్యాధి లక్షణాలు. రీ ఇవి కలుషితమైన నీటిద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

కడుపులో తర చుగా ప్రేగులు కదులుతూ విరేచనానికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. వీరికి ఎలర్జీ లక్షణాలు ఉండి, అరుగుదల తక్కువగా ఉంటుంది. రీ మల పరీక్ష చేయించి వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. సాధారణంగా వీరికి ఎలాంటి మందులు వాడకుండానే ఈ వ్యాది తగ్గుతుంది. అయితే మరలా ఈ పురుగులు కనబడతాయి.

బద్దె పురుగులు :
పందిమాంసం తినేవారిలో ప్రముఖమైన ‘టీనియా సోలియం అనే బద్దె పురుగు కనిపిస్తుంది. సరిగ్గా ఉడికీ, ఉడకని పశుమాంసం తినే వారిలో ఈ బద్దెపురుగు కనబడవచ్చు. ఇది పొడవైన పురుగు. రీ ఇది సూమారు పదిమీటర్ల వరకు పెరిగే జీవి. అయితే పురుగు చివరి భాగం నుండి చిన్న చిన్న దోసగింజల్లాంటివి ఒక సెంటీమీటరు పొడవుగల ముక్కలు మలంతో పాటుగా రాలి పడుతుంటాయి. రీ ఈ మలాన్ని పంది తింటే పంది శరీరంలోకి ప్రవేశించి, అక్కడి ఉండి ఆ పందిమాసం తింటే మరలా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తాయి.

బద్దె పురుగు లార్వాలు రక్తప్రసరణ ద్వారా మెదడుకు చేరితే తీవ్రమైన పరిణా మాలు కలుగుతాయి. తలనొప్పి, ఫిట్స్‌ వస్తాయి. ఒక్కో సారి మరణం కూడా సంభవించవచ్చు. బద్దె పురుగులు కడుపులో చేరితే ఆకలి లేకపోవ డం, బరువు కోల్పోవడం, వంట్లో ఎక్కడ పడితే అక్కడ దురదలు కలగ డం, కడుపునొప్పి, ప్రేగులలో ఉన్నట్లయితే ప్రేగులు రంధ్రాలు పడటం జరుగుతుంది.

దీనికి ఆపరేషన్‌ చేసి కుళ్ళిన ప్రేగుబాగం, పురుగు తల భాగాన్ని తీసివేయాలి. రీ ఈ బద్దెపురుగు శరీరంలో చేరకుండా ఉండాలంటే శరీర శుభ్రత కంటే ఆహార శుభ్రత ముఖ్యం. సరిగ్గా ఉడికీ, ఉడకని పందిమాంసం తినడం వల్లే ఇది శరీరంలో ప్రవేశిస్తుంది.