నెలసరి సమయంలో నొప్పి

ఆరోగ్యం- జాగ్రత్తలు

Pain during menstruation
Pain during menstruation

చాలామంది మహిళలకు నెలసరి సమయంలో నొప్పి వస్తుంది.

కారణం సాధారణం పీరియడ్స్‌ సమయంలో, నెలమొత్తం మందంగా తయారైన గర్భాశయ లోపలి ఎండోమెట్రియమ్‌ పొర బ్లీడింగ్‌ రూపంలో ముక్కల్లాగా, పలచని పొరలాగా బయటకు వచ్చేస్తుంది.

ఆ క్రమంలో అనేక కారణాల వల్ల కొందరిలో ఈ పొర గర్భాశయం నుంచి ఫెలోపియన్‌ ట్యూబుల ద్వారా, రక్తనాళాల ద్వారా, ఇంకా అనేక విధాలుగా పొత్తికడుపులోకి ప్రవేశించడం జరుగుతుంది.

కొందరిలో అది క్రమేణా నశించిపోతుంది.ప్రతినెలా పీరియడ్‌ సమయంలో ఈ పొరలో కూడా కొద్దిగా బ్లీడింగ్‌ కావడం జరుగుతుంది.

దీనినే ఎండోమెట్రియాసిస్‌ అంటారు. కొందరిలో ఈ ఎండోమెట్రియాసిస్‌ అంటారు. కొందరిలో ఈ ఎండోమెట్రియమ్‌ పొర ముక్కలో ప్రతినెలా బ్లీడింగ అవుతూ, అది పెరుగుతూ, అది ఉన్న అవయం లోపలికి చొచ్చుకుపోతూ పెరగడం మొదలవుతుంది.

దీనినే డీప్‌ ఇన్‌ఫ్లీజరేటింగ్‌ ఎండోమెట్రియాసిస అంటారు.

ఇందులో భాగంగా అడినోమయోసిస్‌, అండాశయాల్లో చాక్లెట్‌ సిస్ట్‌లు,పేగులు, గర్భాశయం ట్యూబులు, అండాశయం దగ్గరకు వచ్చి అతుక్కుపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇందులో లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

కొందరిలో పీరియడ్స్‌ సమయంలో విపరీతమైన కడుపునొప్పి, కలయికలో నొప్పి, నడుం నొప్పి, పొత్తికడుపులో నొప్పి, అధిక రక్తస్రావం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

కొందరిలో అసలు ఏ లక్షణాలూ ఉండవు. వేరే సమస్యకు లాపరోస్కోపీ వంటి ఆపరేషన్లు చేసినప్పుడు మాత్రమే సమస్య ఉన్న విషయం బయటపడుతుంది.

నెలసరిలో నొప్పి రావడానికి ఎండోమెట్రియాసిస్‌ ఒక్కటే కారణం కాదు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నా, ఇన్‌ఫెక్షన్సు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ (పిడిఐ) ఉన్నా, ఇంకా వేరే కారణాల వల్ల కూడా కావచ్చు.

కొందరిలో ఏ సమస్యా లేకపోయినా పీరియడ్స్‌ సమయంలో ప్రోస్టోగ్లాండిన్స్‌ అనే హోర్మోన్స్‌ ప్రభావం వల్ల గర్భాశయం కుంచించుకున్నట్లయి, ఎండోమెట్రియమ్‌ పొరకురక్త ప్రసరణ తగ్గి, బ్లీడిండ్‌ రూపంలో బయటకు వస్తుంది.

ప్రోస్టోగ్లాండిన్స్‌ విడుదలయ్యే మోతాదును బట్టి పీరియడ్స్‌ సమయంలో నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది.

కాబట్టి మీ అంతట మీరే ఏదో ఊహించే సుకోకుండా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, కారణం తెలుసుకోవడానికి స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలి .

సమస్య ఏమీ లేకపోతే, నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఆ రెండుమూడు రోజులునొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/