నీళ్లు పడని బోరుబావులను పూడ్చివేయాలి

మెదక్‌ జిల్లాలో ఘటన..

నీళ్లు పడని బోరుబావులను పూడ్చివేయాలి
padma-devender-reddy mla

మెదక్‌: మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల సాయివర్థన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై స్పందించిన టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఇలాంటి ఘటనలు మరోసారి జరగొద్దని అన్నారు. నీళ్లు పడని బోరుబావులను రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని కోరారు. కాగా, స్థానిక అధికారులు, రిగ్‌ యజమానుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని బాలల హక్కుల సంఘం నేతలు అంటున్నారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. అలాగే, సహాయక సిబ్బంది కూడా ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/