ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభానికి ప్యాకేజీలు కీలకమే!

ILFS
ILFS

ముంబయి: నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీలో పనిచేసిన డైరెక్టర్లకు ఇచ్చిన భారీ ప్యాకేజిలు కూడా నష్టాలకు సంక్షోభానికి ఒక కారణంగా విచారణ సంస్థలు భావిస్తున్నాయి. 2018-19 వార్షికనివేదికనుచూస్తే కంపెనీలో పనిచేసిన డైరెక్టర్లకు భారీ ప్యాకేజిలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మొత్తంబోర్డును 2018-19లోనే ప్రక్షాళనచేసిప్పటికీ ప్యాకేజిల్లో మార్పులు రాలేదు. మొదటి ఆరునెలల కాలంలో డైరెక్టర్లకు చేతినిండా వేతనం లభించింది. వైస్‌ఛైర్మన్‌ ఎండిగా పనిచేసిన హరిశంకరన్‌ బోర్డులో గత ఏడాది సెప్టెంబరు వరకూ నాన్‌ఎగ్జిక్యూటివ డైరెక్టర్‌గాపనిచేసారు. ఆయనకు 6.38 కోట్లు పరిహారం లభించింది. మాజీ ఛైర్మన్‌ రవిపార్థసారధి సుమారు నాలుగుకోట్లు నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు గత ఏడాది ఏప్రిల్‌ ఒకటినుంచి జులై 21వ తేదీవరకూ పనిచేసి నాలుగుకోట్లు ఇంటికి తీసుకెళ్లారు. సిఇఒగాను, జాయింట్‌ఎడిగా పనిచేసిన అరుణ్‌ కె సాహా రూ.6.88 కోట్లు ప్యాకేజి లభించింది. ఒక పూర్తిస్థాయి డైరెక్టర్‌గా అనుబంధ కంపెనీల్లోపనిచేసారు. పాత కంపెనీలో పనిచేసిన స్వతంత్ర డైరెక్టర్లకుసైతం భారీ కేటాయింపులుజరిగాయి. అలాగే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఉద్యోగుల సగటు వేతనం కూడా 13.1 లక్షలుగా ఉంది. ఎన్‌సిఎల్‌టి కొంతమంది ఉద్యోగులను నియమించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/