ఎన్నికల ర్యాలీలో స్టెప్పులేసిన ఓవైసి

asudin awasi
asudin awasi

ముంబయి: మహారాష్ట్రలో ఓటర్లను ప్రన్నం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను తమ పార్టీల తరఫున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆటపాటలు, డాన్స్‌లతో స్థానిక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఔరంగాబాద్‌కు వెళ్లారు. అక్కడ పాటకు స్టెప్పులు వేసి డాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఔరంగాబాద్‌లోని పైథాన్‌ గేట్‌లో సభనుద్దేశించి ప్రసంగించిన మజ్లిస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్టేజీ మీద నుండి కిందకు దిగుతూ ఒక పాటకు మెట్ల మీద నుంచే స్టెప్పులు వేశారు. హిప్‌ షేక్‌ చేశారు. కొన్ని సెకన్లపాటు డాన్స్‌ చేసి అక్కడి ఓటర్లను ఆకట్టుకున్నారు. తమ నేత స్టుప్టులను చూసిన ఓటర్లు వన్స్‌మోర్‌ ప్లీస్‌ అంటూ చప్పట్లు కొట్టారు. మజ్లిస్‌ గుర్తు గాలిపటం కావడంతో ఆ స్టెప్పువేసి తమ గుర్తుకే ఓటు వేయాలని వెరైటీగా చెప్పారు. ర్యాలీలో ప్రసంగించిన అసదుద్దీన్‌ ప్రధాని మోడీపై మండిపడ్డారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ వివాదాస్పద అంశాలను లేవనెత్తి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను రెచ్చగొడతారని దుయ్యబట్టారు. 1993లో జరిగిన ముంబయి పేలుళ్ల బాధితులకు న్యాయం జరగలేదని న్యాయం జరగలేదంటారని, అయితే ప్రధాని తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నిందితులను పట్టుకుని యాకూబ్‌ అనే వ్యక్తిని ఉరితీయడం కూడా జరిగిందని ఒవైసీ గుర్తుచేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/