కెసిఆర్ బీఆర్ఎస్ ప్రకటన ఫై ఎంఐఎం అధినేత‌ ఓవైసీ ట్వీట్

కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన ఫై ఎంఐఎం అధినేత‌, హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్‌ గా మార్చేశారు పార్టీ అధినేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పర్వదినాన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై టిఆర్ఎస్ ‘బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి )’ గా మారింది.

దీంతో రాజకీయ నేతలంతా కూడా కేసీఆర్ కు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంత‌రం చెందినందుకు కేసీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఓవైసీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కొత్త‌గా ప్రారంభ‌మైన ఆ పార్టీకి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు చెబుతున్న‌ట్లు ఓవైసీ పేర్కొన్నారు.

అలాగే రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ కూడా ట్విట్టర్ ద్వారా ..లెజెండ‌రీ నాయ‌కుడు కేసీఆర్ నాయ‌క‌త్వంలో అస‌మాన‌మైన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను త్వ‌ర‌లోనే మీరంతా అనుభ‌వించ‌బోతున్నార‌ని త‌న ట్వీట్‌లో సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మరోపక్క కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణలోని జిల్లాకేంద్రాలు, నగర కార్పొరేషన్‌, మున్సిపల్‌, మండల, గ్రామాలల్లో ఇవాళ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.