కేసీఆర్ ను తన కూతురి వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరిన ఒవైసీ

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..తెలంగాణ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలోమర్యాదపూర్వకంగా కలిశారు. తన కూతురు వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భాంగా రెండు రోజులుగా కేసీఆర్ ఢిల్లీ లోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ లోనే ఉండనున్నట్లు సమాచారం. ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ బుధువారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ జెండాను కెసిఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించి, కెసిఆర్ ఆశీనుల‌య్యారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్, జేడీఎస్ అధినేత‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకుల‌తో పాటు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.