అతిగా తింటే కేన్సర్‌ మీ వెంటే

Eating
Eating

అతిగా తింటే కేన్సర్‌ మీ వెంటే

ఆకలి వేస్తుందని బిస్కెట్లు, స్వీట్లు, చాక్‌లెట్లు, కేకులు ఇలా ఏది పడితే అది తినేయకండి. పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని, ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అబెర్‌దీన్‌, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా రెండువేల మంది పేగు కేన్సర్‌కు చెందిన బాధితులను వారు పరీక్షించారు. వారి ఆహార అలవాట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు బాగా తియ్యగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకున్న వారికి పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని తేల్చారు. కేకులు, డ్రింకులు, క్రిస్పీలు, డెజర్ట్‌లు, బిస్కెట్లు వంటి తీపి ఆహారపదార్థాలను మితిమీరి తినడం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే అవకాశాన్ని వారు పసిగట్టారు. అందుకని ఇకమీదట వీటిని తినే ముందు కాస్త ఆలోచించి తినండి.