మమ్మల్ని వెంటనే కాపాడండి
కరోనా భయంతో నౌకలోని ప్రయాణికులందరని నిర్భందించిన అధికారులు

టోక్యో: జపాన్ నౌకలో చిక్కుకున్న తమను వెంటనే కాపాడాల్సిందిగా కోరుతూ ఓ భారతీయుడు ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేశాడు. 3711 మందితో ప్రయాణిస్తున్న జపాన్‌కు చెందిన క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్‌లో దాదాపు 200 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆ నౌకలోని ప్రయాణికుంలందరినీ నిర్బధించారు. యొకొహామా తీరానికి చేరిన ఈ నౌకను జపాన్ ప్రభుత్వం అక్కడే నిలిపి ఉంచింది. ఇప్పటి వరకు నౌకలో ఉన్న దాదాపు 64 మందికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. నౌకలో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతోందని..తమను భారత అధికారులు వెంటనే కాపాడాల్సిందిగా కోరుతూ పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేసుబుక్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్టుపై పశ్చిమ బెంగల్ మంత్రి బెనర్జీ స్పందించారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/