అఫ్ఘన్‌లో 24 గంటల్లో 100 మంది ఉగ్రవాదులు హతం

100 terrorists killed
100 terrorists killed

కాబూల్‌: ఎప్పుడు బాంబు పేలుళ్లు, ఉగ్రదాడులతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్‌ ముష్కరుల కోసం భీకర ఆపరేషన్లు మొదలుపెట్టింది. ఆప్ఘనిస్థాన్‌ బలగాలు నిర్వహించిన . ఈ ఆపరేషన్‌లో భాగంగా 24 గంటల్లో 100 మంది ఉగ్రవాదులను ఆఫ్ఘన్‌ బలగాలు అంతమొందించాయి. ఈ మేరకు ఆప్ఘనిస్థాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. ఆప్ఘనిస్థాన్‌లోని 15 ప్రావిన్స్‌లలో 18 ఆపరేషన్లు నిర్వహించాం. ఆపరేషన్లు ప్రారంభించిన 24 గంటల్లోనే 109 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. 45 మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో వెల్లడించింది. అయితే హతమైన ఉగ్రవాదులంతా ఒకే సంస్థకు చెందిన వారా? లేక వివిధ గ్రూపులకు చెందిన వారా? అనే విషయంలో ఆప్ఘన్‌ బలగాలు స్పష్టత ఇవ్వలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/