మరో తొమ్మిది దేశాలకు పాకిన కరోనా వైరస్‌

వివరాలు వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Coronavirus
Coronavirus

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లోనే కొత్తగా తొమ్మిది దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. మాల్దీవులు, బల్గేరియా, అల్బేనియా, కోస్టారికా, ఫారో ఐలాండ్స్, ఫ్రెంచ్ గయానా, మాల్టా, మార్టినిక్, రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా దేశాల్లో కరోనా వైరస్ బాధితులను గుర్తించినట్టు తెలిపింది. దీంతో కరోనా ప్రభావిత దేశాల జాబితా వందకు చేరింది. చైనా తర్వాత ప్రపంచంలో ఇటలీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అతి ఎక్కువగా నమోదైంది. ఇటలీలో ఇప్పటివరకు ఏడు వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/