రెచ్చగొడితే దీటైన జవాబు చెప్పడానికి సిద్ధం

అమర జవాన్లకు ప్రధాని మోడి నివాళి

YouTube video

న్యూఢిల్లీ: భారత్‌, చైనా వివాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడి స్పందించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని… రెచ్చగొడితే మాత్రం దీటుగా సమాధానం చెపుతామని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందని అన్నారు. రెండోరోజూ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ లో ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికుల త్యాగాలను స్మరిస్తూ అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులను స్మరిస్తూ ప్రధాని మోడి, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, 15 రాష్ట్రాల సీఎంలు మౌనం పాటించారు. భారత అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోడి, ముఖ్యమంత్రులు నివాళులర్పించారు. ‘దేశ రక్షణ కోసం అమరులైన 20 మంది జవాన్ల వీరత్వం ఏమాత్రం వృథా పోదని నరేంద్ర మోడి స్పష్టం చేశారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటోందని, అయితే రెచ్చగొడితే మాత్రం సరైన, దీటైన జవాబు చెప్పడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. తమకు దేశ ఐక్యత, సార్వభౌమత్వం చాలా ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. చైనా సైనికులతో సరిహద్దుల్లో పోరాడుతూ వీర మరణం పొందిన సైనికులను చూసి దేశం ఎంతో గర్విస్తోందని ‘ మోడి అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/