మా ప్రాణాలకు కనీసం విలువ ఇవ్వరా?

ఇరాన్‌ను ప్రశ్నించిన బాధితులు

Plane Crash
Plane Crash

టెహ్రాన్‌: ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని కూల్చివేయడంపై ఇరాన్‌ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు కనీసం విలువ కూడా ఇవ్వండం లేదంటూ వారు వాపోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇరానీయుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. కెనడాలో ఉన్నత విద్యనభ్యసించడానికి వారు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే విమానాన్ని కూల్చివేయడమే కాకుండా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు, పశ్చాత్తాపడటం కూడా లేదు. పైగా అబద్ధాలు చెప్తున్నారు అని టెహ్రాన్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానాన్ని కూల్చిన ఘటనను మొదట వ్యతిరేకించిన ఇరాన్‌, తరువాత చేసింది మేమే అని ఒప్పుకుంది. దీంతో ఇరాన్‌ చర్యపై కెనడా, ఉక్రెయిన్‌ దేశాలు ఆగ్రహించాయి. విమానం కూల్చివేతకు బాధ్యులైన ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/