మోస్ట్ తెలుగు పాపులర్ స్టార్స్‌లో ప్రభాస్ నెం.1

బాహుబలి , సాహో , రాధే శ్యామ్ మూవీస్ తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటె తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయ్యింది. తెలుగు మోస్ట్ పాపులర్ మేల్ స్టార్‌గా రెబెల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. అక్టోబరు నెలకి సంబంధించి ఓర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో ప్రభాస్‌కే ఎక్కువ మంది ఓటేసి టాప్ వన్ లో ఉంచారు.

తాజాగా ఓర్మాక్స్ మీడియా సర్వే చేసిన మోస్ట్ పాపులర్ మేల్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా లో ప్రభాస్ నెం.1లో నిలవగా.. ఆ తర్వాత జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఆరో స్థానములో , నాని ఏడు స్థానంలో విజయ్ దేవరకొండ 8వ స్థానంలో నిలవగా.. మెగాస్టార్ చిరంజీవి 9వ స్థానానికి పడిపోయారు. వెంకటేశ్ పదో స్థానంలో నిలిచారు. టాప్-10లో నందమూరి బాలకృష్ణ , అక్కినేని నాగార్జున చోటు దక్కించుకోలేకపోయారు.