ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌..ఇన్వర్టర్‌ ఎయిర్‌ కూలర్లు

Orient Electric launches energy-efficient inverter air-coolers
Orient Electric launches energy-efficient inverter air-coolers

హైదరాబాద్‌: సీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓరియెంట్‌ ఎలక్ర్టిక్‌ .. విద్యుత్‌ను ఆదా చేసే ఇన్వర్టర్‌ ఎయిర్‌ కూలర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కూలర్లలో ఎలక్ర్టానికల్లీ కమ్యుటేటెడ్‌ మోటార్‌ (ఈసీఎం) టెక్నాలజీని వినియోగించారు. దీని వల్ల 50 శాతం వరకు విద్యుత్‌ వ్యయాలు ఆదా అవుతాయని కంపెనీ చెబుతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారితంగా, వైఫైతో, అలెక్సా ఆధారంగా ఇచ్చే వాయిస్‌ కమాండ్స్‌, గూగుల్‌ అసి్‌స్టతో పని చేసే స్మార్ట్‌ ఎయిర్‌ కూలర్లను కూడా కంపెనీ విడుదల చేసింది. కొత్త కూలర్ల ద్వారా వచ్చే రెండేళ్లకాలంలోనే ఎయిర్‌ కూలర్ల మార్కెట్లో 25 శాతం వాటాను సొంతం చేసుకోవాలన్న లక్ష్యం తో కంపెనీ ఉంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త ఎయిర్‌ కూలర్లను అభివృద్ధి చేశామని, వీటి వినియోగం చాలా సౌకర్యవంతంగా, పనితీరు మెరుగ్గా ఉంటుందని ఓరియెంట్‌ ఎలక్ర్టిక్‌ ఎండీ, సీఈఓ రాకేష్‌ ఖన్నా బుధవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/