అద్భుత ఔషధ గుణాల ఒరెగానో

ఆహారం-ఆరోగ్యం

Oregano - amazing medicinal properties
Oregano – amazing medicinal properties

ఒరెగానో అనేది చిన్న సైజు మొక్క. ఇది ఎంత మంచిందంటే దీనికి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. చక్కటి సువాసనతో పాటు రోగాల్ని నయం చేసే శక్తి దీని సొంతం.

ఒరెగానోలో 40కి పైగా రకాలున్నాయి. వాటిలో ఒరిగానమ్‌ వల్గారే అత్యంత శక్తివంతమైనది.

పశ్చిమ ఆసియాలో పెరిగే ఈ మొక్క తాజా ఆకులు లేదా ఎండి ఆకుల్ని చికెన్‌, మటన్‌, ఆకుకూరలు, అన్ని రకాల వంటల్లోనూ వాడితే మంచి ఫ్లేవర్‌తోపాటు రోగాలకు చెక్‌ పెట్టినట్లవుతుంది.

ఇదే ఒరెగానో ఆకుల నుంచి తైలం కూడా తీస్తున్నారు. దాన్ని రకరకాల జబ్బులు నయం చేసేందుకు వాడుతున్నారు.

ఒరెగానో ఆకులు 23 రకాల చెడు బ్యాక్టీరియా అంతు చూస్తాయి.

కూరల్లో, వేపుళ్లలో ఈ ఆకుల్ని కొద్దిగా వేసుకుంటే చాలు ఇవి పొట్టలోని వ్యర్థాలను తరిమేస్తాయి. చర్మకణాలను కాపాడే శక్తి ఈ ఆకులకు ఉంది.

వీటిలో ఫైబర్‌, విటమిన్‌ కె, మాంగనీస్‌, ఐరన్‌, విటమిన్‌ ఇ, ట్రైప్టోఫాన్‌, కాల్షియం ఉన్నాయి.

కాన్సర్‌, గుండెజబ్బుల అంతు చూసే ఈ ఆకుల వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి.

వీటిలో కేలరీలు చాలా తక్కువ. ఎండిన ఆకుల్ని కంటైనర్లలో నిలువ చేసుకోవచ్చు.

గొంతు గరగరగా ఉన్నా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, వికారంగా ఉన్నా, ముక్కు దిబ్బడ ఉన్నా, గొంతు మంటగా ఉన్నా ఒరెగానో ఆకుల్ని వాడతారు.

ఈ తైలాన్ని ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో రెండు చుక్కలు వేసి తాగవచ్చు.

ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులకు ఈ తైలాన్ని రాయాలి. చలికాలంలో వచ్చే వైరల్‌ ఇన్ఫెక్షన్లపై ఆకులకు పోరాడే శక్తి ఉంది. శరీరంలో వేడిని తగ్గించే గుణాలు వీటిలో ఉన్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/